ఒక దేశకాల పరిస్థితులలో పుట్టినటువంటి
అందరి ప్రారబ్ధకర్మ ఒకే రకముగా ఉంటుంది. అందరు ఒకటే చదువుతారు,
ఒకలాగే ఆలోచిస్తారు, ఒకే రకమైనదే తింటారు. సామూహికమైన కర్మలను పండుగా
మార్చేయటానికి పండుగలు వచ్చాయి. పక్వానికి తీసుకు రావడానికి చేసే దానిని పండుగ
అంటారు. ఆ సంవత్సరము నాడు సామూహికముగా ఆ పండుగ చేసుకోవడం వలన ఆ కర్మలు పక్వానికి
వస్తాయి. అంటే ప్రారబ్ధకర్మ పోతుంది. అంత అద్భుతమైనటువంటి వరాన్ని ఈనాడు ఎవరి
ఇళ్ళల్లో వాళ్ళు తినడానికి ఉపయోగించుకుంటున్నారు. పిండివంటలు చెయ్యడానికి పాపం
ఇంట్లో ఆవిడ చస్తూ ఉంటుంది, అందరు బయట కబుర్లు చెప్పుకుంటూ, TV చూస్తూ, కంప్యూటర్, లాప్ టాప్, ఫోన్లలతో, ఇంటర్
నెట్ తో బిజీగా ఉంటారు. నానా అవస్థపడి చేశాక తినేవాళ్ళు ఎవరు ఉండరు. ఒకరికి gastric
ట్రబుల్, ఇంకొకరికి షుగర్, ఇంకొకరికి బిపి, ఇంకొకరికి ఇంకొకటి, ఈలోపల ఇంటికి ఎవరో వస్తారు చివరికి అంతా గందరగోళం అయిపోతుంది.
ఎంతో అద్భుతమైన శాస్త్రాన్ని
చిన్నచిన్న పండుగలుగా మార్చి ఋషులు అందిస్తే ఆ పండుగనాడు బంధువులు అందరు కలవాలి
అని చెప్తే, ఎందుకు కలవాలి మా ఇంట్లో మేము చేసుకుంటాము అంటారు? ఎందుకు కలవాలి అంటే అందరు అదే
ప్రారబ్ధకర్మలో పుట్టారు కనుక. ప్రారబ్ధకర్మను బట్టే కదా బంధాలు బంధువులు
ఏర్పడతాయి. మరి పైవాడు కర్మలను తీసేయాలి అంటే ఒకరు
అమెరికాలోనూ ఒకరు ఇండియాలోను ఉంటే ఎలా కుదురుతుంది. అంటే అందరు ఒకేచోట ఉండాలి.
అందుకని అందరు కలసి మెలసి పండుగలను చేసుకోండీ అని పెద్దవాళ్ళు చెప్పేది.
Cont …..
No comments:
Post a Comment