Monday, October 27, 2014

ప్రారబ్ద కర్మలు

వి మానసిక కర్మలు. ఇవి స్వేచ్చాపూర్వకముగా, తెలిసి, తీవ్ర ప్రభావముల చేత ప్రేరణ పొంది చేయబడుతు ఉంటాయి. ఇవి మనోయోగముతో చేయబడతాయి. అందువలన వీటి సంస్కారములు కూడా చాలా బలంగా ఉంటాయి. కానీ భౌతిక మనస్సు బుద్ధికి అందదు. హత్య, దోపిడి, కృతఘ్నత, దొంగతనము, వ్యభిచారము మొదలైన క్రూరకర్మలకు అంతఃకరణలో తీవ్ర ప్రతిఘటన జరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక చింతనతో నిరంతర ప్రయత్నం వలన ఏదో ఒకరోజు వాటిని బయటకు పంపవచ్చు. కానీ మానసిక దండన లోలోపలే పూర్తి అవదు. దానికొరకు సాధనములు అవసరమవుతాయి. శిక్షా కార్యక్రమము పూర్తియగుటకు అదే విధమైన సంఘటనాక్రమము ఏర్పడుటకు అంతఃచేతన ఒక వాతావరణమును తయారు చేస్తుంది. దీనికోసం ఒకొక్కసారి చాలాకొద్ది సమయం ఒక్కొక్కసారి చాలా ఎక్కువ సమయం పడుతుంది. 
 
ఉదాహరణకు మోస స్వభావమును నిరోధించుటకు శోకరూపమున దండన అవసరమవవచ్చు అంటే మనం ఎవరినో మోసం చేశాము వాళ్ళకి శోకం వచ్చింది. ఆ శోకం మనం తిరిగి అనుభవించవలసి ఉంటుంది. చేసిన పని (కర్మ) మనం ఎవరికైతే చేస్తామో ఆ చేసిన వ్యక్తి ద్వారానే ఆ కర్మ తిరిగిరావాలని లేదు. ఏదో ఒక రూపములో, ఎవరో ఒకరి రూపములో (చేతలలో) బయటకు వస్తుంది. అంటే మనం మోసం చేసినవాళ్ళే తిరిగి మనలను మోసం చేయాలని లేదు. అంతఃచేతన అలాంటి పరిస్థితులను ఉత్పన్నం చేయడానికి నిమగ్నమై ఉంటుంది. అనగా రెండు చైతన్యములు తమ కొరకు తగిన అవకాశములను వెదుకుతూ ఉంటాయి. ఎప్పుడు జత దొరుకుతుందో అప్పుడు సంఘటనకు ఆధారము ఏర్పడుతుంది. అంటే ఉదాహరణకు తండ్రికి పుత్రశోకము పుత్రునికి అల్పాయుష్యు ఉన్నప్పుడు ఆ రెండు ఒకచోట కూర్చబడతాయి. 
 
కర్మ ఫలితములు రెండు విధములుగా ఉంటాయి. శారీరిక దండన ఒక విధమైనది. ఉదాహరణకు విషము తినిన వెంటనే మరణించుట జరుగుతుంది. కానీ హత్య చేసినవాడు ఆపనిని బయట పెట్టనిచో, అంతఃకరణ వెంటనే ఆ పాపమును శిక్షించదు. కానీ ఆరోజు నుండి హింస వృత్తిని అసహ్యించుకొనుటకు హింసలో ఏ దుఖఃము ఉందో ఆ అనుభవమును చూపుటకు మార్గములను వెదుకుతూ ఉంటుంది. ఎప్పుడైతే రెండవ వైపు నుండి ఆ పరిస్థితి ఏర్పడటానికి అవకాశము దొరుకుతుందో అప్పుడు ఆ నిర్ధారిత సంఘటనకు ఆధారము అవుతుంది. చెడు పనులు చేసిన వెంటనే దుఖము కలగకపోవడానికి, మంచి పనులు చేస్తున్నా దుఖము కలగటానికి ఇదే కారణము. 
 
కర్మ పరిపక్వము చెంది లభించిన శుభమునే అదృష్టము అంటారు. తెలిసి తెలిసి ఏ దుష్కర్మలు చేయబడుతుంటాయో అవి ఆకస్మిక రూపములో కష్టములుగా వస్తాయి. కొత్తగా చేయబడిన కర్మలు ఏర్పాట్లు (preparations) అవి ముందు ముందు అదృష్టములు, దురదృష్టములుగా మారతాయి. కర్మ దూడ వంటిది. ప్రారబ్ధము ముసలి ఆవు వంటిది. ప్రారబ్ధములో ఇరుక్కున్నవాళ్ళు ఏది కావాలనుకుంటే అది చెయ్యలేరు. మనిషి యొక్క వశములో లేనివి ప్రారబ్ధకర్మల ఫలితములు అవుతాయి.

 

 

Monday, October 20, 2014

సంచిత కర్మలు

కర్మలు మన సంస్కారములపై ఆధారపడి ఉంటాయి. ప్రతిరోజు కొన్ని పనులు మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు చెడు నడతగల వర్గములోకానీ (group), స్థలములోకానీ (place) ఉండటం వలన వాటి ప్రభావం ఎంతోకొంత మన మీద గుప్తరూపములో పడుతుంది. ఈ ప్రభావము మనపై పడినప్పటికీ దానిని మనము ఇష్టపూర్వకముగా స్వీకరించలేదు. అందువలన అవి తేలికగా (light) మన అంతఃచేతనలో ఏదో ఒక మూల పడి ఉంటాయి. ఇటువంటి హీన సంస్కారము కలిగించు కర్మలను సంచిత కర్మలు అనవచ్చు.
ఏ పనులు మన వములో (control) లేక, అణగదొక్కబడి తప్పని పరిస్థితులలో చేయవలసి వస్తాయో, ఒకవేళ నా వశములో ఉంటే ఈపనిని అసలు చేయను అనే భావనతో చేస్తామో, ఏపని స్వభావసిద్ధముగా మన సొంతము చేసుకోబడదో ఆ పనుల ద్వారా వచ్చే కర్మలను సంచిత కర్మలు అనవచ్చు.
మనస్సు చేసే పనికి విరుద్ధముగా ఎదురుతిరుగుతున్నా, ఆ పని చేసినప్పుడు వచ్చే కర్మలు తేలికైన సంచిత కర్మల శ్రేణిలో చేరుతాయి. ఈ కర్మలు బలహీనముగా తేలికగా ఉంటాయి. బయటపడే అవకాశము రాకపోతే ఇవి మనోభూమిలో కొన్ని వేలసంవత్సరాల వరకు కూడా అలాగే ఉంటాయి. ఎప్పుడైతే ఉత్తమ సంస్కారములు ప్రోగు చేసుకుంటూ ఉంటామో అప్పుడు ఈ చెడు సంస్కారములు మంచి సంస్కారముల వేడిలో ఇగిరిపోతాయి. దీనికోసమే పూర్వకాలములో ఎక్కువగా తీర్ధయాత్రలు చేసేవారు. చాలా తక్కువ మోతాదులో ఉన్న పాపము దైవదర్శనము, దైవకార్యములు, సేవలవలన ఎన్నో జన్మల పాపములు సమసిపోయేవి.                

Monday, October 13, 2014

గవ్యకల్ప తపస్సు - సంచిత కర్మలు

మూడు నెలల పాటు ఆవు నుండి లభించే ఆహారపదార్ధాలపై శరీరాన్ని ఉంచడం.  దీనిమూలముగా శరీరము కల్పమవుతుంది .
అద్భుతమైన కాయకల్ప తపస్సు ఇది. ఆవుదగ్గరే ఎక్కువగా గడపడం. ఆవులను కాయడం, మేపడం, ఆవు దగ్గరే ఉండడం, గోశాలను శుభ్రం చెయ్యడం, గో మూత్రము, ఆవుపేడను ఉపయోగించి స్నానం చెయ్యడం. పరిపూర్ణమైన సంచిత కర్మలను భస్మం చేస్తుంది ఇది. గో సేవలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ సంచిత కర్మ ఉండదు, అద్భుతమైన శక్తి ఆవు శరీర నిర్మాణములోనే ఉన్నది. ఆవు యొక్క సామీప్యత వలన పరిణామక్రమములో అనునుకూలమైనటువంటి, ఉపయోగపడనువంటి ఎన్నికోట్ల జన్మల సంచితకర్మ ఉన్నా మొత్తం భస్మం అయిపోతుంది.

Friday, October 10, 2014

తపస్సు ద్వారా కర్మలను మార్చుకోవడం

స్వధర్మమును పాలించేటప్పుడు వచ్చే శారీరిక, మానసిక కష్టాలను ఆనందముతో సహించటమే తపస్సు. తపస్సు వలన ఆత్మప్రసన్నతను పొందగలము. ఉపాసకుడు దేనికోసం తపస్సు చేస్తాడో దానిని ఆత్మనందే పొందుతాడు. దీనివలన శరీరము సూక్ష్మముగాను, విశాలముగాను తాను అనుకున్నట్లు పొందగలడు. 12 రకముల తపస్సుల ద్వారా మనిషి తన అంతఃకరణలోని నిద్రాణమైన శక్తులను వికసింపచేసుకోగలుగుతాడు. అందుచేతనే ఈ తపశ్చర్యలను పాపనాశకమైన, శక్తివర్ధకమైన తపశ్చర్యలు అని అంటారు. తపశ్చర్యలు రెండు రకములైన ఫలితాలను ఇస్తాయి.
 
1.     పాపాన్ని నాశనం చేస్తాయి. పాపము అంటే పరిణామక్రమములో అభివృద్ధి చెందటానికి అడ్డుపడేది.
     ఈ అడ్డుపడేది ఏదైనా దానిని తపస్సు నాశనం చేస్తుంది.

2.      పుణ్యాన్ని ఇస్తాయి. పుణ్యము అంటే శుభకర్మలు చెయ్యడానికి, పరిణామక్రమములో ముందుకు వెళ్ళడానికి కావలసినటటువంటి శక్తి. ఈ శక్తి తపస్సు వలన లభిస్తుంది.  

 1. ఆస్వాద తపస్సు : ఆస్వాద తపస్సులో రుచి, కోరిక రెండింటినీ భోజనము నుండి తొలగించాలి. దీనివలన మానసిక చంచలత పోతుంది. వాక్ శక్తి పెరుగుతుంది. 
ఈ తపస్సు వలన నాలిక మీద విజయము లభిస్తుంది. వాక్ శక్తి ఉందంటారు చాలామందికి. అంటే వారి నోటిలో నుండి ఏదైనా ఒక మాట వస్తే ఆ మాట జరిగిపోతుందని. ఆ శక్తిని అభివృద్ధి చేసుకోవడానికి ఆస్వాద తపస్సు చెయ్యాలి. దీనికోసం చాలా రుచిగా ఉండేటటువంటి పదార్ధాన్ని వారానికి ఒకరోజు తినకుండా ఉండాలి.  చాలా రుచికరమైన పదార్ధాలు ఉప్పు, తీపి. ఉప్పులేకపోతే ఇంకా రుచేలేదు. అంచేత ఉప్పు, తీపి లేనటువంటి ఆహారాన్ని వారానికి ఒక రోజు తీసుకోవాలి. వీలైతే గురువారం. సాధనలకు గురువారం ఒక special రోజు. ఒకరోజు తీపి, ఉప్పు లేనటువంటి ఆహారాన్ని స్వీకరించడం. ఇంకాస్త సాధన చేయగలిగే వాళ్ళు నెలకి మూడు రోజులు చేసుకోవచ్చు. ఏ మూడు రోజులు అంటే వారి జన్మ నక్షత్రము, భార్య/భర్త యొక్క జన్మ నక్షత్రము, పెద్ద సంతానము యొక్క జన్మ నక్షత్రము కూతురైనా కొడుకైనా ఎవరైనా సరే మొదటి బిడ్డ. ఈ మూడు నక్షత్రాలు ప్రతి నెలా వస్తాయి. దీనివలన ప్రకృతికి దగ్గరగా ఉండగలగలగడం వస్తుంది. ఆ మూడు రోజులలో చెయ్యడం కుదరలేదు మానేయకుండా ఇంకొక మూడు రోజులు నిర్ణయించుకోవాలి. ఇంకా చెయ్యగలిగితే నెలకి ఏడు రోజులు. ఇది వాక్ శక్తిని improve చేసుకోవడానికి చేసే తపస్సు. మంత్ర సాధకునికి వాక్ శక్తి ఎక్కువ కావాలి అందుచేత సాధకులు ఈ తపస్సు తప్పకుండా చెయ్యాలి.                                            

2. తితీక్షా తపస్సు : ఋతువులలో ఆ ఆ ఋతువులకు అనుగుణముగా జీవించగలగటం. చలిని, వేడిని భరించటం. దీనివలన సహిష్ణుత, సంకల్పబలం పెరుగుతాయి. తితీక్ష తప్పస్సు మన సూక్ష్మ శరీరములో ఉన్నటువంటి పరిణామక్రమానికి అనునుకూలమైన పరిస్థితులను break చేస్తుంది.
తితీక్ష అంటే ప్రకృతి యొక్క ప్రభావానికి మనం లొంగిపోకుండా ప్రకృతికి అనుగుణ్యముగా జీవించడం. ఎండా కాలం fan వేసుకోను. Fridge లో నీళ్ళు త్రాగను ఎదురుకుండా Fridge పెట్టుకొని. ఆత్మశక్తిని ఇస్తుంది. ఋతువుకి విపరీతముగా ఉండగలగడం. శీతాకాలము కప్పుకోకుండా పడుకోవడము. అలా అని కప్పుకోకుండా పడుకొని రెండవరోజు జలుబు, జ్వరం తెచ్చేసుకుంటే అది మళ్ళీ foolishness. శరీరానికి కర్మాధి దేవతలు ఏవో limitations ఇచ్చి ఉంటారు దానిని బట్టీ చేసుకోవాలి. కప్పుకోకుండా పడుకోవడానికి ట్రై చేసి రాత్రంతా మెలకువగా ఉండి రెండవ రోజు office కి వెళ్ళగలిగితే / ఇంట్లో పని చేసుకోగలిగితే వణికినా పరవాలేదు రోగం, అలసట రాకూడదు. common sense ఉపయోగించుకోవాలి. వర్షాకాలం వర్షం పడుతోంది కనుక ఆఫీస్ కి రాలేదు. రెండు చినుకులు ఒక పని చేయకుండా ఆపేశాయంటే మనకున్నటువంటి సంకల్ప బలం ఎంత? వర్షం వలన ఏ కార్యక్రమము ఆగకపోతే తితీక్ష తపస్సుకు  ప్రకృతి సహకరించింది అక్కడ. వర్షం కురిసినా ఆ వర్షంలోనే ఆ పని చెయ్యాలితప్ప నో escapism. కొంతమందికి వర్షంలో తడిస్తే ఆస్తమ వచ్చేస్తుంది అలాంటి వాళ్ళు తడవకూడదు. శరీర నిర్మాణాన్ని చూసుకోవాలి. చదువుకోవాలి వర్షం కురుస్తోంది వెళ్తావా వెళ్ళవా కాలేజీకి? కానీ అస్మా వచ్చి ఓ ఇరవై రోజులు మంచం మీద ఉండే బదులు ఒక్క రోజు వర్షంలో తడవటం మానేయవచ్చు. కానీ వర్షంలో తడసినా ఏమీ అవదు అనే శరీరము వస్తే అప్పుడు పరిణామక్రమానికి శరీరము suit అయినట్లు. తితీక్ష తపస్సు వలన ఋతువుల ప్రభావము మనని ఏమీ చేయదు. అవధూతలు దీనికి పెద్ద ఉదాహరణలు. ఇంటి లోపలికి రారు. చెట్టు కిందే ఉంటారు. బట్టలు వేసుకోరు. వారు  చేసేది తితీక్ష తపస్సు.

3. కర్షతపస్సు : శారీరిక సౌకర్యాలను వదిలివేయ్యటం, తనపని తాను చేసుకోవటం. దీనివలన       ఆత్మనిర్బరత, సమానత్వము కలుగుతాయి          
కర్షతపస్సు అంటే ఎవరి పనులు వారు చేసుకోవడం, పనులకోసం ఇతరుల సహాయం తీసుకోకపోవడం. పొద్దున నిద్ర లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోటప్పటి వరకు. ఈ తపస్సు చెయ్యడం వలన మనిషి ఆత్మనిర్బలుడు కాడు self dependent అవుతాడు. ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితులలో ఉన్నా ఇంకొకరి సహాయం వారికి అక్కరలేదు. అలాంటి కర్షక తపస్సు చేసిన వ్యక్తి అడవిలో ఉన్నా వానికి కావలసినది వాని దగ్గరకు వస్తుంది. కానీ ఈ తపస్సు మనస్ఫూర్తిగా చెయ్యాలి. ఈ తపస్సులో కొత్తగా చేసేది ఏమీ ఉండదు రోజు చేసేవే. కానీ ఇంకొకళ్ళు మనకు చేసేది మనం చేయించుకోకపోవడమే. మరి అన్నం కూడా మేమే వండుకోవాలా? Common sense ఆదివారం రోజు వండచ్చు, రాకపోతే ఆ పని కూడా నేర్చుకోవాలి. ఎంత తీవ్రముగా చేసుకోగలిగితే ఎంత depth గా ఈ నియమాన్ని పెట్టుకోగలిగితే అంతా తొందరగా self control వస్తుంది. వీలుపడనివి వదిలేయవచ్చు, కానీ ప్రయత్నించాలి.  

4. ఉపవాసము : ఉప + ఆవాసము. అంటే దగ్గరగా కూర్చోవటం. పరమాత్మునికి అయినా, జ్ఞానానికి అయినా ఆ ధ్యాసలో ఆహారముపై మక్కువతగ్గి, కొద్దిగా తినటంకానీ, అసలు తినకపోవటంకానీ జరుగుతుంది. దీనివలన శారీరిక, మానసిక వికారాలు పోతాయి.
భౌతిక జగత్తులో ఆహారము పూర్తిగా మానెయ్యడము ఉపవాసము. ఉపవాసము చేసే రోజులలో నీళ్ళు బాగా తీసుకోవాలి. నిర్జల ఉపవాసము గురువు యొక్క ఆజ్ఞ తోనే చెయ్యాలి. లేకపోతే నిర్జల ఉపవాసము పనికిరాదు. ఉపవాసములో ఏ ఆహారము తీసుకోకూడదు. పాలు కూడా తీసుకోకూడదు నీరు మాత్రమే తీసుకోవాలి. నిమ్మకాయ కొంచం ఉప్పు పంచదార కలిపిన నీళ్ళు కానీ షరబత్ లాగా కాదు. ఉపవాసము నెమ్మది నెమ్మదిగా శరీరానికి అలవాటు చెయ్యాలి. ముందు ఒకపూట భోజనము ఒకపూట ఫలహారము, తర్వాత రెండు పూటలు ఫలహారము, తర్వాత ఒకపూట ఉపవాసము ఒకపూట ఫలహారము, తర్వాత పూర్తి ఉపవాసము. ఇదంతా జరగటానికి కొన్ని నెలలు, సంవత్సరాల టైమ్ పడుతుంది. expert guide ఉంటే తప్ప నిర్జల ఉపవాసము చేయకూడదు.

5. గవ్యకల్ప తపస్సు : మూడు నెలల పాటు ఆవు నుండి లభించే ఆహారపదార్ధాలపై శరీరాన్ని ఉంచడం.  దీనిమూలముగా శరీరము కల్పమవుతుంది .
అద్భుతమైన కాయకల్ప తపస్సు ఇది. ఆవుదగ్గరే ఎక్కువగా గడపడం. ఆవులను కాయడం, మేపడం, ఆవు దగ్గరే ఉండడం, గోశాలను శుభ్రం చెయ్యడం, గో మూత్రము, ఆవుపేడను ఉపయోగించి స్నానం చెయ్యడం. పరిపూర్ణమైన సంచిత కర్మలను భస్మం చేస్తుంది ఇది. గో సేవలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ సంచిత కర్మ ఉండదు, ఆ అద్భుతమైన శక్తి ఆవు శరీర నిర్మాణములోనే ఉన్నది. ఆవు యొక్క సామీప్యత వలన పరిణామక్రమములో అనునుకూలమైనటువంటి,  ఉపయోగపడనువంటి ఎన్నికోట్ల జన్మల సంచితకర్మ ఉన్నా మొత్తం భస్మం అయిపోతుంది.  

6. ప్రదాతవ్య తపస్సు : కష్టాలు, లేమి అనుభవిస్తూ కూడా ఇతరులకు సహాయం చెయ్యటం.
ప్రదాతవ్య తపస్సు అంటే మనం ఆర్జించినటువంటి డబ్బు అతి స్వల్పముగా మన దగ్గర ఉంచుకొని ఎక్కువగా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు ఇవ్వడం.

7. నిష్కాసన తపస్సు : మనలోపల దాచుకున్న అపరాధాలను మార్గదర్శకునికి చెప్పి, మళ్ళీ ఆ తప్పు చేయను అని సంకల్పము తీసుకోవటం.
మనకి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి దగ్గర మనం చేసిన తప్పులన్నీ ఒప్పేసుకోవడం. కానీ ఎవరు ఎప్పుడు శత్రువు అవుతారో తెలియదు. మన రహస్యాలన్నీ చెప్పేస్తే కొంపలు అంటుకుంటాయి. మనస్ఫూర్తిగా ఒక కాగితం మీద డైరీలాగా రాసుకొని, రాసుకోగానే కాల్చేయాలి దానిని. కాల్చేస్తే దానిని అగ్నిదేవుని ముందు మనసు విప్పి చెప్పుకున్నట్టు. అంతకంటే గొప్ప సాక్షి ఎక్కడా దొరకడు. అనేక కర్మలకు ఆయన సాక్షి. ఎప్పుడైనా మనం ఈ పని చేయకుండా ఉంటే బాగుండేది అని అనుకొని దాని నుండి వచ్చే దుష్ఫలితాలనుండి తప్పించుకోవాలంటే ఏమి చెయ్యక్కరలేదు మనస్ఫూర్తిగా కాగితం మీద పెట్టి ఇలాంటి తప్పు నేను మళ్ళీ చెయ్యను అనే తీక్షణమైన సంకల్పం తీసుకొని అగ్నిని రగిల్చి లేక చిన్న అగ్గిపుల్ల తీసుకొని కాల్చేయడం. నిష్కాసన తప్పసులో main ఏమిటంటే ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండటం.

8. సాధనా తపస్సు : గాయత్రీ మంత్రమును ఒక్కొక్క అంగములో ఒక్కొక్క అక్షరమును శరీరములో జాగృతం చేసుకోవటం (అక్షరన్యాసం). దీనివలన 9 రోజులలో 24 వేల గాయత్రీ మంత్ర జపము పూర్తిఅవుతుంది.  
నవరాత్రులలో లేక విశేషమైన పర్వదినాలలో చేసేటటువంటి అనుష్టాన కాలము. మామూలు రోజులలో చేసే జపంకన్నా ఎక్కువ, ఎంత చెయ్యగలమో అంత చెయ్యడం. 


9. బ్రహ్మచర్య తపస్సు : బ్రహ్మచర్య తపస్సు అంటే సాధకుడు బ్రహ్మలాగా మారటం, ప్రాణశక్తి పెంచుకోవటం. కామవాసనలను (కోరికలను) అదుపులో ఉంచుకోవటం వలన బ్రహ్మచర్యమును త్వరగా పొందవచ్చు.
కామము శక్తి కోల్పోవడానికి ఎక్కువ కారణమౌతుంది. శక్తి సంగ్రహణ కోసము కామమయ ఆలోచనలకు దూరముగా నెలరోజులు కానీ ఒక సంవత్సర కాలము కానీ ఎవరి వీలునుబట్టి వాళ్ళు ఉండగలగడం బ్రహ్మచర్య తపస్సు. 


10. చాంద్రాయణ తపస్సు : చందునిలాగా రోజురోజుకీ మన కోరికలను తగ్గించుకుంటూ, భగవంతునితో లింక్‌ను పెంచుకోవటం.
చంద్రుని కళలకు అనుగుణముగా ఆహారములో మార్పులు చేసుకోవాలి. పౌర్ణమి నుంచి అమావాస్య వరకు చెయ్యాలి. రోజు తీసుకునే ఆహారమును రోజురోజుకు తగ్గించుకుంటూ అంటే ఆహారములో 16 వ వంతు వరకు తగ్గించాలి. మళ్ళీ ఆహారమును అమావాస్యనుంచి పౌర్ణమి వరకు పెంచుకుంటూ పోవాలి.
అర్ధచంద్రాయణ తపస్సు : పదిహేను రోజులలో పూర్తి అయ్యేది. అంటే ఆహారములో 16 వ వంతు కాకుండా 8 వ వంతు తగ్గిస్తాము. పౌర్ణమి నుంచి అమావాస్య వరకు 15 రోజులపాటు చేసుకోవాలి.  


11. మౌనవ్రత తపస్సు : బహిర్ముఖము అయ్యే శక్తులు అంతర్ ముఖం కావటం వలన అత్మోన్నతి మార్గము సులభమవుతుంది. మౌనం వాక్కుతో మొదలై ఆలోచనలతో (మనస్సు) అంతం అవుతుంది. దీనివలన దైవముపై ఏకాగ్రత పెరుగుతుంది. దానివలన దైవీశక్తి జాగృతమవుతుంది.
మౌన తపస్సు అంటే అవసరము లేకుండా మాట్లాడకుండా ఉండటం. నోటితో మాట్లాడకుండా ఉండటం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నెమ్మది నెమ్మదిగా ఆలోచనలలో కూడా మౌనం వస్తుంది అంటే ఆలోచనారహిత స్థితి. మౌనం వలన శక్తి ఆవిర్భవిస్తుంది. మాట్లాడవలసిన చోట మాట్లాడాలి లేకపోతే పనులు అస్తవ్యస్తముగా జరుగుతాయి. ప్రతిచోట common sense sense ఉపయోగించాలి.    

12. అర్జన తపస్సు : ఉత్పాదన కోసం ఉపయోగకరమైన విద్యను నేర్చుకోవటమే అర్జన తపస్సు.
ప్రకృతి యొక్క పరిణామక్రమమునకు అనుకూలమైన పరిస్థితులను ఆర్జించాలి. ప్రకృతి యొక్క పరిణామక్రమమును తెలుసుకోవాలి. ఎంతగా తెలుసుకోవాలంటే దారిలో ఒక రిక్షావాడు వెళుతుంటే వాడు పరిణామక్రమములో ఎక్కడ ఉన్నాడో అర్ధం అవ్వాలి. మహామహులు పరిణామక్రమములో ఎక్కడ ఉన్నారో తెలియాలి మీరాబాయి, త్యాగరాజు, శంకరాచార్య, అక్బర్, ముస్సోలినీ, హిట్లర్ ఇలా వారి జీవితాలు మనకు చాలా స్పష్టంగా తెలుసు కదా వీరు పరిణామక్రమములో ఎక్కడ ఉన్నారు? పరిణామక్రమము యొక్క మొదలు ఏమిటి? అంతం ఏమిటి? దీని తెలుసుకొనే తపస్సు. ఈ తపస్సు పరిపూర్ణముగా పరిణామక్రమము అర్ధం చేసుకోవడమే.

13. పరమ తపస్సు : విశిష్ట ప్రయోజనము కోసము విశిష్ట స్థాయిలో చేసేది. సమిష్టి ప్రయోజనాల కోసం ఈ తపస్సును ఉపయోగిస్తారు. శ్రీరామకృష్ణ పరమహంస, అరవిందులు, రమణ మహర్షి మొదలైనవారు భారతదేశము యొక్క భాగ్యపరివర్తన కోసం సూక్ష్మ వాతావరణాన్ని మార్చివేసారు.          
 
ఎవరు ఏ తపస్సు చేస్తారు అన్నది ముఖ్యం కాదు ఎవరి ప్రారాబ్ధానికి అనుగుణ్యముగా వారు తపస్సు చెయ్యాలి. ఆస్వాద వ్రతం, మౌన వ్రతం, బ్రహ్మచర్య వ్రతం, ఆర్జన తపస్సు వీటిలో ముఖ్యమైనవి.

Thursday, October 9, 2014

ప్రారబ్ధకర్మను మార్చుకోవడానికి అలవరచుకోవలసిన జీవనచర్యలు

ప్రారబ్ధకర్మను మార్చుకోవడానికి ఐదు రకాలైన జీవనచర్యలను అనుసరించాలి. ప్రపంచములో మానవ శరీరము ధరించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సంచిత, ప్రారబ్ధకర్మలను పూర్తి చేసుకోవడానికే పుడతారు.
1. మృత్యువు యొక్క రహస్యాన్ని చేధించుట. అన్ని మానవ శరీరాలు మృత్యువు యొక్క రహస్యాన్ని చేధించుటయే లక్ష్యముగా పెట్టుకొని పృధ్వీపైకి వస్తాయి. ఎవరికి తగ్గ ప్రారబ్ధకర్మను బట్టి వారికి ఆ శరీరము వస్తుంది. ఆ శరీరముతో మృత్యువు యొక్క రహస్యాన్ని ఎలా చేధించాలో అన్నదానికి ఒక formula ఇచ్చారు పరమపూజ్య గురుదేవులు శ్రీరామశర్మ ఆచార్యగారు. ప్రతిరోజు కొత్తజన్మ ప్రతిరాత్రి కొత్త మృత్యువు. ఈ  భావనతో జీవించడం నేర్చుకుంటే ఈ లక్ష్యాన్ని సాధించగలము. ఈ లక్ష్యాన్ని సాధించడానికి మనం చేసిన సంచితకర్మలో ఈ జన్మలో చేసిన ఎంత ప్రారబ్ధకర్మ తీసుకువచ్చాము అన్నదానికి మళ్ళీ రెండు సూత్రాలు ఇచ్చారు గురుదేవులు. అవి ఆత్మబోధ, తత్వబోధ (ref book  క్రాంతి ధర్మీ సాహిత్యం  - 19)
ఆత్మబోధ : ప్రథమ సాధన ఇది. కళ్ళు తెరవగానే నేడు నాకొక కొత్త జన్మ. ఒకరోజు మాత్రమే జీవిస్తున్నాను. రాత్రి మరణం ఒడిలోకి చేరతాను. మధ్య ఉన్న కాలాన్ని సర్వోత్తమంగా ఉపయోగించటమే జీవనసాధన లక్ష్యం. ఇదే నా పరీక్షాక్రమం. దీనిలోనే భవిష్యత్తు మొత్తం నిండిఉన్నది అని భావన చేసుకోవాలి. నిద్రలేవగానే నేను ఆత్మని. ఆత్మ ఎలా జీవిస్తుందో ఇవాళ జరగబోయే సంఘటనల గురించి అలా ఆలోచించాలి. ఫలానా వాళ్ళని కలుసుకోవటానికి వెళ్తాను, ఫలానా ఆఫీసులో పనిచేయవలసి వస్తుంది, ఫలానా చోట ఇలాంటి ఇలాంటి వాళ్ళు (different types of people) అందరు ఉంటారు, మనస్సుకు నచ్చినవాళ్ళు ఉంటారు, మనస్సుకు నచ్చనివాళ్ళు ఉంటారు వాళ్ళతో వ్యక్తిలాగా కాకుండా ఒక ఆత్మ ఎలా ప్రవర్తిస్తుందో నేను అలా ప్రవర్తిస్తాను అనే సంకల్పము తీసుకోవడమే ఆత్మబోధ. 
తత్వబోధ : రెండవ సాధన ఇది. రాత్రి పడుకోబోతున్నాను, మృత్యువు ఒడిలోకి వెళుతున్నాను అని అనుకొకముందు తత్వబోధ చేసుకోవాలి . ఏమిటి ఈ తత్వబోధ? ఆత్మవలే జీవించానా? ఒకటే ప్రశ్న దానికి జవాబు ఇచ్చుకోవాలి. ఎక్కడ ఎక్కడ ఆత్మవలే జీవించలేదో అక్కడ గట్టిగా సంకల్పం తీసుకోవాలి అక్కడ అలా జీవించవలసి ఉండవలసింది కాదు అని అనుకుంటే correct చేసుకోవాలి ఎవరిని వారు పక్కవాళ్లను కాదు.
ఏదో ఒక సంఘటన జరిగింది మీకు కోపం వచ్చేసింది మీరు fire అయిపోయారు రాత్రి పశ్చాత్తాప పడిపోయి కళ్ళవెంట నీళ్ళు కార్చుకొని ఛా నేను వెధవను ఎందుకు పనికిరాను, ఆధ్యాత్మికత వద్దే వద్దు నాకు - ఇలా ఆలోచించకూడదు. కోపం వచ్చింది - కోపం వచ్చినప్పుడు నేనే ఆత్మను అయితే అక్కడ ఎలా ప్రవర్తించేదానినో /ప్రవర్తించేవాడినో , కోపం రాకూడదు నాకు వాళ్ళకు ప్రేమతో చెప్పి ఉండాల్సింది. దానిని recollect చేసుకోవాలి, ఆ పరిస్థితిని. కోపంతో ప్రవర్తించాను కదా దానిని తుడిపేసుకోవాలి. లేదు నేను కోపంతో ప్రవర్తించలేదు ఇలా ప్రేమగా ప్రవర్తించి ఉండాల్సింది అని ఆ scene ను మీరు ఊహించుకోవాలి. అది ఊహించుకున్న తర్వాత కనుక నిద్రపోతే ఈ కోపంతో వచ్చేటటువంటి ఆగామి సంచిత కర్మ ఉండదు. అలా ఊహించుకొని ఆత్మవలే ప్రవర్తించగలిగితే ఆ కర్మ తుడుచుకుపోతుంది పూర్తిగా. మళ్ళా వాళ్ళ దగ్గరకు వెళ్ళి క్షమాపణ అది అడగక్కరలేదు, అడిగితే మళ్ళీ కొంపలు అంటుకుపోతాయి. క్షమాపణ అడిగితే next day మన నెత్తిన ఎక్కుతారు వాళ్ళు. Common sense ఉపయోగించాలి. మనం మారాలి. ఎదుటివాళ్ళను కాదు మార్చాల్సింది. రోజంతా కరెక్ట్‌ గా ఉండటానికి ట్రై చేశాము. రాత్రి పడుకునే ముందు భగవంతుని సన్నిధిలోకి వెళుతున్నాం. అక్కడ జవాబు (explanation) ఇవ్వాలి అందరు, ఇది తెలుసుకోవాలి. గడిచిన రోజును తిరిగి తీసుకురాలేము కానీ దానికి ప్రాయశ్చిత్తం మరునాడు ఖచ్చితంగా చేసుకోవాలి. మరునాటి  కార్యకలాపాలలో రోజు చేయలేనిదాన్ని కలపాలి. దీనివలన కొంత పనిభారం పెరుగుతుంది. ప్రాయశ్చిత్తాలు చేసుకునేలాంటివి పెట్టుకోవాలి. చేయలేని ప్రాయశ్చిత్తాలు పెట్టుకున్నా వేస్టే అంతా. నిత్య జీవనములో కాలాన్ని సవ్యముగా ఉపయోగించుకోవాలి. ప్రతిరోజూ కొత్త జన్మ ప్రతి రాత్రీ కొత్త మృత్యువు. లేచిన దగ్గర నుండి పడుకునే వరకు చాలా టైమ్ మనము వెస్ట్ చేస్తాము ఒక్క క్షణము కూడా వెస్ట్ కాకుండా ఉండేటటువంటి ఒక జీవన ప్రణాళిక అభివృద్ధి చేసుకోవాలి. అది ఎవరికోసం వాళ్ళు చేసుకోవాలి. టైమ్ వేస్ట్ కాకూడదు అనే అత్యాసతో,  కోరికతో మన సామర్ధ్యానికి మించినటువంటి time table వేసుకుంటే మనకే విసుగేస్తుంది. లైఫ్ ఇంకెందుకు అనిపిస్తుంది. అది బాలన్స్ చేసుకోవాలి.