స్వధర్మమును పాలించేటప్పుడు వచ్చే శారీరిక, మానసిక కష్టాలను ఆనందముతో సహించటమే
తపస్సు. తపస్సు వలన ఆత్మప్రసన్నతను పొందగలము. ఉపాసకుడు
దేనికోసం తపస్సు చేస్తాడో దానిని ఆత్మనందే పొందుతాడు. దీనివలన శరీరము సూక్ష్మముగాను, విశాలముగాను తాను అనుకున్నట్లు పొందగలడు. 12 రకముల
తపస్సుల ద్వారా మనిషి తన అంతఃకరణలోని నిద్రాణమైన శక్తులను వికసింపచేసుకోగలుగుతాడు. అందుచేతనే
ఈ తపశ్చర్యలను పాపనాశకమైన, శక్తివర్ధకమైన తపశ్చర్యలు అని అంటారు. తపశ్చర్యలు రెండు రకములైన ఫలితాలను
ఇస్తాయి.
1. పాపాన్ని నాశనం చేస్తాయి.
పాపము అంటే పరిణామక్రమములో అభివృద్ధి చెందటానికి అడ్డుపడేది.
ఈ అడ్డుపడేది ఏదైనా దానిని తపస్సు నాశనం చేస్తుంది.
2. పుణ్యాన్ని ఇస్తాయి. పుణ్యము అంటే
శుభకర్మలు చెయ్యడానికి, పరిణామక్రమములో ముందుకు వెళ్ళడానికి కావలసినటటువంటి శక్తి. ఈ శక్తి
తపస్సు వలన లభిస్తుంది.
ఈ తపస్సు వలన నాలిక మీద విజయము లభిస్తుంది. వాక్ శక్తి
ఉందంటారు చాలామందికి. అంటే వారి నోటిలో నుండి ఏదైనా ఒక మాట వస్తే ఆ మాట
జరిగిపోతుందని. ఆ శక్తిని అభివృద్ధి చేసుకోవడానికి ఆస్వాద తపస్సు చెయ్యాలి. దీనికోసం చాలా రుచిగా
ఉండేటటువంటి పదార్ధాన్ని వారానికి ఒకరోజు తినకుండా ఉండాలి. చాలా రుచికరమైన పదార్ధాలు ఉప్పు, తీపి. ఉప్పులేకపోతే
ఇంకా రుచేలేదు. అంచేత ఉప్పు, తీపి లేనటువంటి ఆహారాన్ని
వారానికి ఒక రోజు తీసుకోవాలి. వీలైతే గురువారం. సాధనలకు గురువారం ఒక special
రోజు. ఒకరోజు తీపి, ఉప్పు లేనటువంటి ఆహారాన్ని
స్వీకరించడం. ఇంకాస్త సాధన చేయగలిగే వాళ్ళు నెలకి మూడు రోజులు చేసుకోవచ్చు.
ఏ మూడు రోజులు అంటే వారి జన్మ నక్షత్రము,
భార్య/భర్త యొక్క జన్మ నక్షత్రము, పెద్ద సంతానము యొక్క జన్మ
నక్షత్రము కూతురైనా కొడుకైనా ఎవరైనా సరే మొదటి బిడ్డ. ఈ మూడు నక్షత్రాలు ప్రతి
నెలా వస్తాయి. దీనివలన ప్రకృతికి దగ్గరగా ఉండగలగలగడం వస్తుంది. ఆ మూడు రోజులలో
చెయ్యడం కుదరలేదు మానేయకుండా ఇంకొక మూడు రోజులు నిర్ణయించుకోవాలి. ఇంకా చెయ్యగలిగితే
నెలకి ఏడు రోజులు. ఇది వాక్ శక్తిని improve చేసుకోవడానికి
చేసే తపస్సు. మంత్ర సాధకునికి వాక్ శక్తి ఎక్కువ కావాలి అందుచేత సాధకులు ఈ తపస్సు
తప్పకుండా చెయ్యాలి.
2. తితీక్షా తపస్సు : ఋతువులలో ఆ ఆ ఋతువులకు అనుగుణముగా
జీవించగలగటం. చలిని, వేడిని భరించటం. దీనివలన సహిష్ణుత,
సంకల్పబలం పెరుగుతాయి. తితీక్ష తప్పస్సు
మన సూక్ష్మ శరీరములో ఉన్నటువంటి పరిణామక్రమానికి అనునుకూలమైన పరిస్థితులను break చేస్తుంది.
తితీక్ష అంటే ప్రకృతి యొక్క ప్రభావానికి మనం లొంగిపోకుండా
ప్రకృతికి అనుగుణ్యముగా జీవించడం. ఎండా కాలం fan వేసుకోను. Fridge లో నీళ్ళు త్రాగను ఎదురుకుండా Fridge పెట్టుకొని. ఆత్మశక్తిని
ఇస్తుంది. ఋతువుకి విపరీతముగా ఉండగలగడం. శీతాకాలము కప్పుకోకుండా పడుకోవడము. అలా
అని కప్పుకోకుండా పడుకొని రెండవరోజు జలుబు, జ్వరం
తెచ్చేసుకుంటే అది మళ్ళీ foolishness. శరీరానికి కర్మాధి
దేవతలు ఏవో limitations ఇచ్చి ఉంటారు దానిని బట్టీ చేసుకోవాలి.
కప్పుకోకుండా పడుకోవడానికి ట్రై చేసి రాత్రంతా మెలకువగా ఉండి రెండవ రోజు office
కి వెళ్ళగలిగితే / ఇంట్లో పని చేసుకోగలిగితే వణికినా పరవాలేదు రోగం, అలసట రాకూడదు. common sense ఉపయోగించుకోవాలి. వర్షాకాలం
వర్షం పడుతోంది కనుక ఆఫీస్ కి రాలేదు. రెండు చినుకులు ఒక పని చేయకుండా ఆపేశాయంటే
మనకున్నటువంటి సంకల్ప బలం ఎంత? వర్షం వలన ఏ కార్యక్రమము ఆగకపోతే
తితీక్ష తపస్సుకు ప్రకృతి సహకరించింది
అక్కడ. వర్షం కురిసినా ఆ వర్షంలోనే ఆ పని చెయ్యాలితప్ప నో escapism. కొంతమందికి వర్షంలో తడిస్తే ఆస్తమ వచ్చేస్తుంది అలాంటి వాళ్ళు తడవకూడదు. శరీర
నిర్మాణాన్ని చూసుకోవాలి. చదువుకోవాలి వర్షం కురుస్తోంది వెళ్తావా వెళ్ళవా
కాలేజీకి? కానీ అస్మా వచ్చి ఓ ఇరవై రోజులు మంచం మీద ఉండే
బదులు ఒక్క రోజు వర్షంలో తడవటం మానేయవచ్చు. కానీ వర్షంలో తడసినా ఏమీ అవదు అనే
శరీరము వస్తే అప్పుడు పరిణామక్రమానికి శరీరము suit అయినట్లు.
తితీక్ష తపస్సు వలన ఋతువుల ప్రభావము మనని ఏమీ చేయదు.
అవధూతలు దీనికి పెద్ద ఉదాహరణలు. ఇంటి
లోపలికి రారు. చెట్టు కిందే ఉంటారు. బట్టలు వేసుకోరు. వారు చేసేది తితీక్ష తపస్సు.
3. కర్షణ తపస్సు : శారీరిక సౌకర్యాలను వదిలివేయ్యటం, తనపని తాను చేసుకోవటం. దీనివలన ఆత్మనిర్బరత, సమానత్వము కలుగుతాయి.
కర్షణ తపస్సు అంటే ఎవరి పనులు వారు చేసుకోవడం, పనులకోసం ఇతరుల సహాయం తీసుకోకపోవడం. పొద్దున నిద్ర లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోటప్పటి వరకు. ఈ తపస్సు చెయ్యడం వలన మనిషి ఆత్మనిర్బలుడు కాడు self dependent అవుతాడు. ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితులలో ఉన్నా ఇంకొకరి సహాయం వారికి అక్కరలేదు. అలాంటి కర్షక తపస్సు చేసిన వ్యక్తి అడవిలో ఉన్నా వానికి కావలసినది వాని దగ్గరకు వస్తుంది. కానీ ఈ తపస్సు మనస్ఫూర్తిగా చెయ్యాలి. ఈ తపస్సులో కొత్తగా చేసేది ఏమీ ఉండదు రోజు చేసేవే. కానీ ఇంకొకళ్ళు మనకు చేసేది మనం చేయించుకోకపోవడమే. మరి అన్నం కూడా మేమే వండుకోవాలా? Common sense ఆదివారం రోజు వండచ్చు, రాకపోతే ఆ పని కూడా నేర్చుకోవాలి. ఎంత తీవ్రముగా చేసుకోగలిగితే ఎంత depth గా ఈ నియమాన్ని పెట్టుకోగలిగితే అంతా తొందరగా self control వస్తుంది. వీలుపడనివి వదిలేయవచ్చు, కానీ ప్రయత్నించాలి.

4. ఉపవాసము : ఉప + ఆవాసము. అంటే దగ్గరగా కూర్చోవటం. పరమాత్మునికి అయినా, జ్ఞానానికి అయినా ఆ ధ్యాసలో ఆహారముపై మక్కువతగ్గి, కొద్దిగా తినటంకానీ, అసలు తినకపోవటంకానీ
జరుగుతుంది. దీనివలన శారీరిక, మానసిక వికారాలు పోతాయి.
భౌతిక జగత్తులో ఆహారము పూర్తిగా మానెయ్యడము ఉపవాసము.
ఉపవాసము చేసే రోజులలో నీళ్ళు బాగా తీసుకోవాలి. నిర్జల ఉపవాసము గురువు యొక్క ఆజ్ఞ
తోనే చెయ్యాలి. లేకపోతే నిర్జల ఉపవాసము పనికిరాదు. ఉపవాసములో ఏ ఆహారము తీసుకోకూడదు.
పాలు కూడా తీసుకోకూడదు నీరు మాత్రమే తీసుకోవాలి. నిమ్మకాయ కొంచం ఉప్పు పంచదార
కలిపిన నీళ్ళు కానీ షరబత్ లాగా కాదు. ఉపవాసము నెమ్మది నెమ్మదిగా శరీరానికి అలవాటు చెయ్యాలి.
ముందు ఒకపూట భోజనము ఒకపూట ఫలహారము, తర్వాత రెండు పూటలు ఫలహారము, తర్వాత ఒకపూట ఉపవాసము
ఒకపూట ఫలహారము, తర్వాత పూర్తి ఉపవాసము. ఇదంతా జరగటానికి
కొన్ని నెలలు, సంవత్సరాల టైమ్ పడుతుంది. expert guide
ఉంటే తప్ప నిర్జల ఉపవాసము చేయకూడదు.
5. గవ్యకల్ప తపస్సు : మూడు నెలల పాటు ఆవు నుండి లభించే ఆహారపదార్ధాలపై
శరీరాన్ని ఉంచడం. దీనిమూలముగా శరీరము కల్పమవుతుంది .
అద్భుతమైన కాయకల్ప తపస్సు ఇది. ఆవుదగ్గరే ఎక్కువగా గడపడం. ఆవులను కాయడం, మేపడం, ఆవు దగ్గరే ఉండడం, గోశాలను శుభ్రం చెయ్యడం, గో మూత్రము, ఆవుపేడను ఉపయోగించి స్నానం చెయ్యడం. పరిపూర్ణమైన సంచిత కర్మలను భస్మం చేస్తుంది ఇది. గో సేవలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ సంచిత కర్మ ఉండదు, ఆ అద్భుతమైన శక్తి ఆవు శరీర నిర్మాణములోనే ఉన్నది. ఆవు యొక్క సామీప్యత వలన పరిణామక్రమములో అనునుకూలమైనటువంటి, ఉపయోగపడనువంటి ఎన్నికోట్ల జన్మల సంచితకర్మ ఉన్నా మొత్తం భస్మం అయిపోతుంది.
6. ప్రదాతవ్య తపస్సు : కష్టాలు, లేమి అనుభవిస్తూ కూడా ఇతరులకు సహాయం చెయ్యటం.
ప్రదాతవ్య తపస్సు అంటే మనం ఆర్జించినటువంటి డబ్బు అతి స్వల్పముగా మన దగ్గర ఉంచుకొని ఎక్కువగా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు ఇవ్వడం.
8. సాధనా తపస్సు : గాయత్రీ మంత్రమును ఒక్కొక్క అంగములో ఒక్కొక్క అక్షరమును శరీరములో జాగృతం చేసుకోవటం (అక్షరన్యాసం). దీనివలన 9 రోజులలో 24 వేల గాయత్రీ మంత్ర జపము పూర్తిఅవుతుంది.
నవరాత్రులలో లేక విశేషమైన పర్వదినాలలో చేసేటటువంటి అనుష్టాన కాలము. మామూలు రోజులలో చేసే జపంకన్నా ఎక్కువ, ఎంత చెయ్యగలమో అంత చెయ్యడం.
9. బ్రహ్మచర్య తపస్సు : బ్రహ్మచర్య తపస్సు అంటే సాధకుడు బ్రహ్మలాగా మారటం, ప్రాణశక్తి పెంచుకోవటం. కామవాసనలను (కోరికలను) అదుపులో ఉంచుకోవటం వలన బ్రహ్మచర్యమును త్వరగా పొందవచ్చు.
కామము శక్తి కోల్పోవడానికి ఎక్కువ కారణమౌతుంది. శక్తి సంగ్రహణ కోసము కామమయ ఆలోచనలకు దూరముగా నెలరోజులు కానీ ఒక సంవత్సర కాలము కానీ ఎవరి వీలునుబట్టి వాళ్ళు ఉండగలగడం బ్రహ్మచర్య తపస్సు.
10. చాంద్రాయణ తపస్సు : చందునిలాగా రోజురోజుకీ మన కోరికలను తగ్గించుకుంటూ, భగవంతునితో లింక్‌ను పెంచుకోవటం.
చంద్రుని కళలకు అనుగుణముగా ఆహారములో మార్పులు చేసుకోవాలి. పౌర్ణమి నుంచి అమావాస్య వరకు చెయ్యాలి. రోజు తీసుకునే ఆహారమును రోజురోజుకు తగ్గించుకుంటూ అంటే ఆహారములో 16 వ వంతు వరకు తగ్గించాలి. మళ్ళీ ఆహారమును అమావాస్యనుంచి పౌర్ణమి వరకు పెంచుకుంటూ పోవాలి.
అర్ధచంద్రాయణ తపస్సు : పదిహేను రోజులలో పూర్తి అయ్యేది. అంటే ఆహారములో 16 వ వంతు కాకుండా 8 వ వంతు తగ్గిస్తాము. పౌర్ణమి నుంచి అమావాస్య వరకు 15 రోజులపాటు చేసుకోవాలి.
అద్భుతమైన కాయకల్ప తపస్సు ఇది. ఆవుదగ్గరే ఎక్కువగా గడపడం. ఆవులను కాయడం, మేపడం, ఆవు దగ్గరే ఉండడం, గోశాలను శుభ్రం చెయ్యడం, గో మూత్రము, ఆవుపేడను ఉపయోగించి స్నానం చెయ్యడం. పరిపూర్ణమైన సంచిత కర్మలను భస్మం చేస్తుంది ఇది. గో సేవలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ సంచిత కర్మ ఉండదు, ఆ అద్భుతమైన శక్తి ఆవు శరీర నిర్మాణములోనే ఉన్నది. ఆవు యొక్క సామీప్యత వలన పరిణామక్రమములో అనునుకూలమైనటువంటి, ఉపయోగపడనువంటి ఎన్నికోట్ల జన్మల సంచితకర్మ ఉన్నా మొత్తం భస్మం అయిపోతుంది.
6. ప్రదాతవ్య తపస్సు : కష్టాలు, లేమి అనుభవిస్తూ కూడా ఇతరులకు సహాయం చెయ్యటం.
ప్రదాతవ్య తపస్సు అంటే మనం ఆర్జించినటువంటి డబ్బు అతి స్వల్పముగా మన దగ్గర ఉంచుకొని ఎక్కువగా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు ఇవ్వడం.
7. నిష్కాసన తపస్సు : మనలోపల దాచుకున్న అపరాధాలను మార్గదర్శకునికి చెప్పి, మళ్ళీ ఆ తప్పు చేయను అని సంకల్పము తీసుకోవటం.
మనకి
చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి దగ్గర మనం చేసిన తప్పులన్నీ ఒప్పేసుకోవడం. కానీ ఎవరు ఎప్పుడు
శత్రువు అవుతారో తెలియదు. మన రహస్యాలన్నీ చెప్పేస్తే కొంపలు అంటుకుంటాయి. మనస్ఫూర్తిగా ఒక
కాగితం మీద డైరీలాగా రాసుకొని, రాసుకోగానే కాల్చేయాలి దానిని. కాల్చేస్తే దానిని అగ్నిదేవుని ముందు మనసు
విప్పి చెప్పుకున్నట్టు. అంతకంటే గొప్ప సాక్షి ఎక్కడా దొరకడు. అనేక కర్మలకు ఆయన
సాక్షి. ఎప్పుడైనా మనం ఈ పని చేయకుండా ఉంటే బాగుండేది అని అనుకొని దాని నుండి
వచ్చే దుష్ఫలితాలనుండి తప్పించుకోవాలంటే ఏమి చెయ్యక్కరలేదు మనస్ఫూర్తిగా కాగితం
మీద పెట్టి ఇలాంటి తప్పు నేను మళ్ళీ చెయ్యను అనే తీక్షణమైన సంకల్పం తీసుకొని
అగ్నిని రగిల్చి లేక చిన్న అగ్గిపుల్ల తీసుకొని కాల్చేయడం. నిష్కాసన తప్పసులో main
ఏమిటంటే ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండటం.8. సాధనా తపస్సు : గాయత్రీ మంత్రమును ఒక్కొక్క అంగములో ఒక్కొక్క అక్షరమును శరీరములో జాగృతం చేసుకోవటం (అక్షరన్యాసం). దీనివలన 9 రోజులలో 24 వేల గాయత్రీ మంత్ర జపము పూర్తిఅవుతుంది.
నవరాత్రులలో లేక విశేషమైన పర్వదినాలలో చేసేటటువంటి అనుష్టాన కాలము. మామూలు రోజులలో చేసే జపంకన్నా ఎక్కువ, ఎంత చెయ్యగలమో అంత చెయ్యడం.
9. బ్రహ్మచర్య తపస్సు : బ్రహ్మచర్య తపస్సు అంటే సాధకుడు బ్రహ్మలాగా మారటం, ప్రాణశక్తి పెంచుకోవటం. కామవాసనలను (కోరికలను) అదుపులో ఉంచుకోవటం వలన బ్రహ్మచర్యమును త్వరగా పొందవచ్చు.
కామము శక్తి కోల్పోవడానికి ఎక్కువ కారణమౌతుంది. శక్తి సంగ్రహణ కోసము కామమయ ఆలోచనలకు దూరముగా నెలరోజులు కానీ ఒక సంవత్సర కాలము కానీ ఎవరి వీలునుబట్టి వాళ్ళు ఉండగలగడం బ్రహ్మచర్య తపస్సు.
10. చాంద్రాయణ తపస్సు : చందునిలాగా రోజురోజుకీ మన కోరికలను తగ్గించుకుంటూ, భగవంతునితో లింక్‌ను పెంచుకోవటం.
చంద్రుని కళలకు అనుగుణముగా ఆహారములో మార్పులు చేసుకోవాలి. పౌర్ణమి నుంచి అమావాస్య వరకు చెయ్యాలి. రోజు తీసుకునే ఆహారమును రోజురోజుకు తగ్గించుకుంటూ అంటే ఆహారములో 16 వ వంతు వరకు తగ్గించాలి. మళ్ళీ ఆహారమును అమావాస్యనుంచి పౌర్ణమి వరకు పెంచుకుంటూ పోవాలి.
అర్ధచంద్రాయణ తపస్సు : పదిహేను రోజులలో పూర్తి అయ్యేది. అంటే ఆహారములో 16 వ వంతు కాకుండా 8 వ వంతు తగ్గిస్తాము. పౌర్ణమి నుంచి అమావాస్య వరకు 15 రోజులపాటు చేసుకోవాలి.
11. మౌనవ్రత తపస్సు : బహిర్ముఖము అయ్యే శక్తులు
అంతర్ ముఖం కావటం వలన అత్మోన్నతి మార్గము సులభమవుతుంది. మౌనం వాక్కుతో మొదలై ఆలోచనలతో (మనస్సు) అంతం అవుతుంది. దీనివలన దైవముపై ఏకాగ్రత పెరుగుతుంది. దానివలన దైవీశక్తి జాగృతమవుతుంది.
మౌన తపస్సు అంటే అవసరము లేకుండా మాట్లాడకుండా ఉండటం. నోటితో
మాట్లాడకుండా ఉండటం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నెమ్మది నెమ్మదిగా ఆలోచనలలో కూడా మౌనం వస్తుంది
అంటే ఆలోచనారహిత స్థితి. మౌనం వలన శక్తి ఆవిర్భవిస్తుంది. మాట్లాడవలసిన చోట మాట్లాడాలి
లేకపోతే పనులు అస్తవ్యస్తముగా జరుగుతాయి. ప్రతిచోట common sense sense ఉపయోగించాలి.
12. అర్జన తపస్సు : ఉత్పాదన కోసం ఉపయోగకరమైన
విద్యను నేర్చుకోవటమే అర్జన తపస్సు.
ప్రకృతి యొక్క పరిణామక్రమమునకు అనుకూలమైన పరిస్థితులను
ఆర్జించాలి. ప్రకృతి యొక్క పరిణామక్రమమును తెలుసుకోవాలి. ఎంతగా తెలుసుకోవాలంటే
దారిలో ఒక రిక్షావాడు వెళుతుంటే వాడు పరిణామక్రమములో ఎక్కడ ఉన్నాడో అర్ధం అవ్వాలి.
మహామహులు పరిణామక్రమములో ఎక్కడ ఉన్నారో తెలియాలి మీరాబాయి, త్యాగరాజు, శంకరాచార్య, అక్బర్,
ముస్సోలినీ, హిట్లర్ ఇలా వారి జీవితాలు మనకు చాలా స్పష్టంగా
తెలుసు కదా వీరు పరిణామక్రమములో ఎక్కడ ఉన్నారు? పరిణామక్రమము
యొక్క మొదలు ఏమిటి? అంతం ఏమిటి? దీని
తెలుసుకొనే తపస్సు. ఈ తపస్సు పరిపూర్ణముగా పరిణామక్రమము అర్ధం చేసుకోవడమే.
13. పరమ తపస్సు : విశిష్ట ప్రయోజనము కోసము
విశిష్ట స్థాయిలో చేసేది. సమిష్టి ప్రయోజనాల కోసం ఈ తపస్సును ఉపయోగిస్తారు. శ్రీరామకృష్ణ పరమహంస, అరవిందులు, రమణ మహర్షి మొదలైనవారు భారతదేశము యొక్క
భాగ్యపరివర్తన కోసం సూక్ష్మ వాతావరణాన్ని మార్చివేసారు.
ఎవరు ఏ తపస్సు చేస్తారు అన్నది ముఖ్యం కాదు ఎవరి
ప్రారాబ్ధానికి అనుగుణ్యముగా వారు తపస్సు చెయ్యాలి. ఆస్వాద వ్రతం, మౌన వ్రతం, బ్రహ్మచర్య వ్రతం, ఆర్జన తపస్సు వీటిలో ముఖ్యమైనవి.
No comments:
Post a Comment