ఇవి మానసిక కర్మలు. ఇవి స్వేచ్చాపూర్వకముగా, తెలిసి,
తీవ్ర ప్రభావముల చేత ప్రేరణ పొంది చేయబడుతు ఉంటాయి. ఇవి మనోయోగముతో చేయబడతాయి. అందువలన వీటి సంస్కారములు కూడా చాలా బలంగా ఉంటాయి. కానీ భౌతిక
మనస్సు బుద్ధికి అందదు. హత్య, దోపిడి, కృతఘ్నత, దొంగతనము, వ్యభిచారము మొదలైన
క్రూరకర్మలకు అంతఃకరణలో తీవ్ర ప్రతిఘటన జరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక చింతనతో
నిరంతర ప్రయత్నం వలన ఏదో
ఒకరోజు వాటిని
బయటకు పంపవచ్చు.
కానీ మానసిక దండన లోలోపలే పూర్తి అవదు. దానికొరకు
సాధనములు అవసరమవుతాయి. ఈ
శిక్షా
కార్యక్రమము పూర్తియగుటకు
అదే విధమైన
సంఘటనాక్రమము ఏర్పడుటకు
అంతఃచేతన ఒక
వాతావరణమును తయారు చేస్తుంది. దీనికోసం ఒకొక్కసారి చాలాకొద్ది సమయం ఒక్కొక్కసారి
చాలా ఎక్కువ సమయం పడుతుంది.
ఉదాహరణకు మోస
స్వభావమును నిరోధించుటకు శోకరూపమున
దండన
అవసరమవవచ్చు అంటే
మనం ఎవరినో మోసం చేశాము వాళ్ళకి శోకం వచ్చింది. ఆ శోకం మనం తిరిగి అనుభవించవలసి ఉంటుంది. చేసిన పని (కర్మ) మనం ఎవరికైతే చేస్తామో ఆ చేసిన వ్యక్తి ద్వారానే ఆ
కర్మ తిరిగిరావాలని లేదు. ఏదో ఒక రూపములో, ఎవరో ఒకరి రూపములో (చేతలలో) బయటకు వస్తుంది. అంటే మనం మోసం చేసినవాళ్ళే తిరిగి మనలను మోసం చేయాలని లేదు. అంతఃచేతన అలాంటి
పరిస్థితులను ఉత్పన్నం చేయడానికి నిమగ్నమై ఉంటుంది. అనగా రెండు చైతన్యములు తమ
కొరకు తగిన అవకాశములను వెదుకుతూ ఉంటాయి. ఎప్పుడు జత దొరుకుతుందో అప్పుడు సంఘటనకు
ఆధారము ఏర్పడుతుంది. అంటే ఉదాహరణకు తండ్రికి పుత్రశోకము పుత్రునికి అల్పాయుష్యు ఉన్నప్పుడు
ఆ రెండు ఒకచోట కూర్చబడతాయి.
కర్మ ఫలితములు రెండు విధములుగా ఉంటాయి. శారీరిక దండన ఒక విధమైనది.
ఉదాహరణకు విషము తినిన వెంటనే మరణించుట జరుగుతుంది. కానీ హత్య చేసినవాడు ఆపనిని బయట
పెట్టనిచో, అంతఃకరణ వెంటనే ఆ పాపమును శిక్షించదు. కానీ ఆరోజు నుండి హింస వృత్తిని
అసహ్యించుకొనుటకు హింసలో ఏ దుఖఃము ఉందో ఆ అనుభవమును చూపుటకు మార్గములను వెదుకుతూ
ఉంటుంది. ఎప్పుడైతే రెండవ వైపు నుండి ఆ పరిస్థితి ఏర్పడటానికి అవకాశము దొరుకుతుందో
అప్పుడు ఆ నిర్ధారిత సంఘటనకు ఆధారము అవుతుంది. చెడు పనులు చేసిన వెంటనే దుఖము
కలగకపోవడానికి, మంచి పనులు చేస్తున్నా దుఖము కలగటానికి ఇదే
కారణము.
కర్మ పరిపక్వము చెంది లభించిన శుభమునే
అదృష్టము అంటారు.
తెలిసి తెలిసి ఏ దుష్కర్మలు చేయబడుతుంటాయో అవి ఆకస్మిక రూపములో కష్టములుగా
వస్తాయి. కొత్తగా చేయబడిన కర్మలు
ఏర్పాట్లు (preparations) అవి ముందు ముందు అదృష్టములు, దురదృష్టములుగా
మారతాయి. కర్మ దూడ వంటిది. ప్రారబ్ధము ముసలి ఆవు వంటిది. ప్రారబ్ధములో
ఇరుక్కున్నవాళ్ళు ఏది కావాలనుకుంటే అది చెయ్యలేరు. మనిషి యొక్క వశములో లేనివి
ప్రారబ్ధకర్మల ఫలితములు అవుతాయి.
No comments:
Post a Comment