Tuesday, November 11, 2014

ఆగామి కర్మలు

శారీరిక కర్మల వెనుక ఏ మానసిక బంధము లేకుండా కేవలము శరీరము ద్వారా శరీరము కొరకు చేయబడు కర్మలను ఆగామి కర్మలు అంటారు. ఇవి నిశ్చిత ఫలమును ఇచ్చు శారీరిక కర్మలు. వీటి ఫలితములు లభించుటకు ఎక్కువ సమయము పట్టదు. ఈ కర్మలు శారీరికమైనవి. ఫలితములు వెనువెంటనే లభిస్తూ ఉంటాయి. మత్తుపదార్ధము సేవించిన వెంటనే ఉన్మాదము వచ్చును. విషము సేవించిన వెంటనే మరణము సంభవిస్తుంది. నియమిత ఆహారము తీసుకోకపోవడం వలన ఆరోగ్య సమస్యలు వస్తాయి.  

No comments:

Post a Comment