Tuesday, November 25, 2014

అన్నము

అన్నము మన ప్రాణాలను నిలబెట్టేది. అందుకే అన్నమును పరబ్రహ్మ స్వరూపము అన్నారు. బ్రహ్మ తత్వమును అన్నము రూపములో స్వీకరించడం ద్వారా బ్రహ్మతత్వాన్ని శరీరము గ్రహిస్తూ ఉంటుంది. భగవద్గీత, విష్ణుసహస్ర నామము ద్వారా కూడా మనకు తెలుస్తున్నది ఇదే. విష్ణువే ఆహారము, ఆ ఆహారమును భక్షించువాడు కూడా ఆయనే. 
 
పూర్వకాలములో అతిధికి భోజనం పెట్టకుండా గృహస్థులు తినేవారు కాదు. ప్రతి ఇల్లు నిత్య సమారాధనలాగా ఉండేవి. అన్నం వండేటప్పుడే ఒక గుప్పెడు ఎక్కువ వెయ్యండి అని చెప్పేవారు. ఇంటికి వచ్చినవారికి లేదనకుండా ఆహారం పెట్టేవారు. తమకు తినడానికి లేకపోయినా ఉన్నది అతిధికి పెట్టి తాము పస్తులు ఉండేవారు. రంతిదేవుడు, మహాభారతములోని బ్రాహ్మణుడు ముంగిస కధ, మొదలైనవి దీనికి ఉదాహరణలు. ఎదుటివారి ఆకలిని తీర్చమే నిజమైన యజ్ఞముగా భావించేవారు. నేడు కాలము, పరిస్థితులు  దాదాపుగా మారిపోయాయి. ఇంటికి ఎవరైనా వస్తే వారు ఎప్పుడు వెళతారా, ఎప్పుడు తిందామా అన్న ధోరణి తప్ప ఉన్నదానితోనే పంచుకుతినే పద్ధతే లేకుండా పోయింది. నూటికి 90% ఇళ్ళు ఇలాగే ఉన్నాయి. చివరికి తిన్నాక మిగిలినవి కూడా మరొకరికి ఇవ్వడానికి ఇష్టపడంలేదు. వాటిని చద్దిపెట్టెలలో (refrigerator) దాచుకుని మళ్ళీ మళ్ళీ తినడానికే ఇష్టపడుతున్నారు. న్ని దానములలోకెల్లా అన్నదానము గొప్పది అంటారు. దానికి కారణము ఏది ఇచ్చినా దానికన్నా మెరుగైనది కావాలని కోరుకుంటారు. చిన్న ఇల్లు ఉంటే పెద్దది కావాలని, పెద్దది ఉంటే ఇంకా పెద్దది కావాలని, ఒక ఇల్లు ఉంటే ఇంకొకటి కావాలని... ఇలా బండి ఉంటే కారు కావాలని, చిన్నకారు పోయి పెద్దకారు రావాలని, లక్ష వస్తుంటే కోటి కావాలని, కోటి వస్తే ఇంకా ఎక్కువ కోట్లు రావాలని ఇలా ఆశకు, కోరికలకు హద్దు లేకుండా ఉంటుంది. కానీ కేవలం అన్నం ఒక్కటే కడుపు నిండితే ఇంక చాలు అనేది. మహాఅయితే నిలవ ఉండేవి ఏవో కొన్ని పచ్చడిలాంటివి మరుసటి రోజుకు, నిలవ ఉండే పిండివంటలు లాంటివి అయితే   వారం పది రోజులకు తప్ప ఎక్కువ రోజులు పదార్ధం నిలవ ఉంచలేరు పాడైపోతాయి కాబట్టి. అందుకనే ఇక చాలు అనేది ఆహారము ఒక్కటే. కడుపు నిండితే ఇకచాలు అనటం తప్ప వేరే దారిలేదు. ప్రాణాలను నిలబెట్టీది అన్నము అంతేకాక ఇకచాలు అనేది అన్నమునకు ఒక్కదానికే, కాబట్టి అన్ని దానములలోకెల్లా ది గొప్పది. 
 
పూర్వకాలములో ఆహారము వండేటప్పుడు కొన్ని సాంప్రదాయాలను పాటించేవారు. భోజనము చెయ్యడానికి ఒక పద్ధతి ఉండేది. కాలక్రమేణ ఆధునిక సమాజములో నిరూపించలేని ఏ కర్మకాండ అయినా నేటితరం వారు ఆమోదించడం లేదు. ఏది ఎందుకు చెయ్యాలి, ఏది చేస్తే ఏమి వస్తుందో చెప్పేవారు కూడా తగ్గిపోయారు. ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్ళు ఇది చెయ్యాలి, ఇలా చెయ్యాలి అని చెప్పినా, దానిని వాళ్ళు సైంటిఫిక్ గా చెప్పలేకపోవడంచేత చాలావిద్యలు, సాంప్రదాయాలు కాలగర్భములో మాయమైపోతున్నాయి.  

పూర్వకాలములో ఇంటిలోని వారందరు ఒకేసారి ఒక బంక్తిగా భోజనం చేసేవారు. అందరి మానసికస్థితి ఆ సమయములో ఒకేలాగా ఉండేది. భోజనానికి ముందు దైవప్రార్ధన చేసేవారు. ఉన్నది కలిసి ఉన్నది పంచుకొని తినేవారు. ఒక్కొక్కరికి అనేకమంది సంతానం ఉన్నా ఆహారానికి మాత్రం ఏలోటు ఉండేది కాదు.

కాలప్రవాహములో ఈ బంక్తి భోజనాలలో ఆహారాన్ని వదిలేయడం (food wastage) మొదలైనది. అందుచేత ప్రకృతి ఈ బఫే సిస్టమ్ (Buffet system) తీసుకువచ్చింది ఎవరికి ఏది కావాలో, ఎంత కావాలో అంతే తీసుకొని, తినమని. కానీ చాలామంది మనుష్యులలో no realization. ప్లేట్ లో పెట్టుకోవడం రుచి బాలేదనో, నూనెఅనో, తియ్యగాఉంది అనో, చల్లగా ఉందిఅనో, ఫ్రెష్ కాదుఅనో  ఏదో ఒకకారణము చేత ఆహారమును వృధా (waste) చెయ్యడం అలవాటు అయిపోయింది. సుఖంగా తినే భోజనం నిలబడి చేయవలసి వచ్చింది. అన్ని పదార్ధాలు ఉన్నా తినడానికి అక్కడ మొహమాటం. మనకు తెలియకుండానే చేసే ఈ తప్పు వలన ఆకలివేసినప్పుడు ఆహారము దొరకకపోవడం జరుగుతోంది. కంచంలో అన్నం వడ్డిస్తారు కానీ వెంటనే రారు తినరు. చిన్నప్పుడు అమ్మ వడ్డించి తిను తిను అని బ్రతిమలాడినా తినడానికి ఇష్టపడరు, పైగా వంకలు పెడుతూ తింటూ ఉంటారు. ఫలితముగా చదువు కోసమో, ఉద్యోగరీత్యానో, ఎక్కడో ఉన్నప్పుడు ఆ కర్మ తిరిగి అనుభవించవలసి వస్తుంది. ఏది తినడానికి ఇష్టపడమో అదే తినాల్సి వస్తుంది. Mostly అక్కడ choice కూడా ఉండదు. మెస్ లోనో, హోటల్ లోనో వాడు భోజనంలో ఏది పెడితే అదే తినాలి ఇంకా టిఫెన్స్ లో కొంత choice ఉంటుంది. అదీ use చేసుకోము. ఏమి తింటారు అని అడిగితే ఎదుటివాళ్ళని నీ ఇష్టం అంటారు. ఎదుటివారికి ఇష్టమైనది మనం ఎందుకు తినడం, మన ఇష్టమైనదే మనం తినవచ్చు కదా. ఆలాకూడా choice లేకుండా చేసుకుంటుంటారు. ఇంట్లోనే అన్నీ తింటే బయటకూడా అన్నీ తినవచ్చు కదా. ఇంట్లో అన్నీ తినకపోవడం వలన బయటకు వెళ్ళినప్పుడు సామాన్యముగా మనం ఇష్టపడనిదే ఎక్కువగా దొరుకుతుంది.     

ఆహారము మనల్ని ఎలా wait చేయిస్తుంది అన్నదానికి మరొక ఉదాహరణ functions. అక్కడ కూడా మనకు choice ఉండదు వాళ్ళు పెట్టినప్పుడు, పెట్టినది తినవలసిందే. దానికి కూడా క్యూ. మళ్ళీ ఎవరికోసమో వెయిటింగ్. ఎందుకు ఇవి అన్నీ అంటే అన్నాన్ని నువ్వు వెయిట్ చేయించావు సో ఇప్పుడు అన్నం నిన్ను వెయిట్ చేయిస్తోంది. As you sow so you reap కానీ ఇది అర్ధం కాక మనం మనుష్యులను, పరిస్థితులను తిట్టుకుంటూ ఉంటాం. వాళ్ళ ఇంటిలో లేట్ అన్నం త్వరగా పెట్టారు అనో, రుచిగా ఉండదు అనో, శుభ్రంగా ఉండదు అనో వెయ్యి కారణాలు. కానీ మన పరిస్థితులకు మనమే కారణం.    

No comments:

Post a Comment