Sunday, November 16, 2014

కర్మమార్గము యొక్క మర్మము

కర్మమార్గము చాలా లోతైనది. ధర్మముగా నడిచేవారికి దుఃఖము, పాపాలు చేసేవారికి సుఖము, సోమరిపోతులుగా ఉండేవారికి విజయము, ప్రయత్నం చేసేవారికి అపజయము, వివేకవంతులకు ఆపద, మూర్ఖులకు సంపద, అహంకారులకు గౌరవము, సత్యము పలికేవారికి తిరస్కారము మొదలైన  సకారాత్మకమైన లక్షణాలు (positive qualities) కలవారికి తిరస్కారము, నకారాత్మక లక్షణాలు (negative qualities) కలవారికి పురస్కారము లభించుట అనేక ఉదాహరణతో ఈ సమాజములో మనం నిత్యం చూస్తూనే ఉంటాము. కొంతమంది పుట్టుకతోనే సంతోషముతో కొంతమంది జీవనపర్యంతం దుఃఖముతో జీవితం గడుపుతూ ఉంటారు. కానీ మానవజీవితములో సుఖదుఖములు పొందుటకు ఖచ్చితమైన నియమములు ఏమీ లేవు.
 
సుఖదుఖములకు కారణము భగవంతుని ఇచ్ఛ మరియు స్వకర్మము. కానీ ప్రాచీన కాలములో ఇచ్చిన వివరణలకు ప్రస్తుత కాలములో తర్కముతో కూడిన ప్రశ్నలకు సమాధానములు దొరకక ఎక్కువమంది పాశ్చాత్య  సిద్ధాంతాల వైపు మరలుతున్నారు. దీని కారణము చేత భగవంతుడు, ధర్మము మొదలైన వాటికి సాక్షములు కనిపించక ఎక్కువమంది నాస్తికత్వపు ఆలోచనలతో స్థిరపడుతున్నారు. ఎప్పుడైతే ఆ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందో అప్పుడు పరధర్మమునుకాక స్వధర్మమువైపే నడవడానికి ఆస్కారము ఉంటుంది. కానీ మనం పొందు ఫలితములన్నింటికి మనం చేసిన, చేస్తున్న కర్మయే కారణము.  

No comments:

Post a Comment