చాలాసార్లు ప్రకృతి నియమమునకు పూర్తి
వ్యతిరేకముగా అనిపించు విషయములు సంభవిస్తూ ఉంటాయి. ఒక మనిషి ఎంతో ఉత్తమ జీవితమును
గడుపుతున్నప్పటికీ ఏదో తప్పుకు దండన విధించినట్లు ఆపదలు వస్తుంటాయి. వేరొకరు ఎంత
చెడు పనులు చేస్తున్నప్పటికీ అతనికి అన్ని రకములైన సుఖసౌభాగ్యములు లభిస్తూ ఉంటాయి.
కష్టపడి పనిచేయనివారికి లాటరీలో, జూదములో, లేక
ఎక్కడో దొరకడం, లేక ఎవరో ఇవ్వడం మూలంగానో ధనము లభిస్తూ
ఉంటుంది. కానీ నిరంతరం శ్రమ చేస్తున్న వ్యక్తి మాత్రం లేమిలో ఉంటూ ఉంటాడు. ఒకరు
కొంచం శ్రమ చేయగానే విజయాన్ని సాధిస్తారు. ఇంకొకరు కఠిన ప్రయత్నం చేసినప్పటికీ
అపజయాన్నే పొందుతూ ఉంటారు. దీనికి కారణము ప్రారబ్ధము. ఒక్కక్కసారి ప్రయత్నం
చేసినప్పటికీ ఫలితము రాదు. దానికితోడు వ్యతిరేక ఫలితాలు వస్తుంటాయి. వాటిని
ఎంతోకొంత అనుభవించక తప్పదు. ఇటువంటి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఇంటికి వచ్చిన
వారినో, కొత్తగా జన్మించిన పిల్లలనో,
కొత్త కోడలినో ఆల్లుడునో, కొత్తగా కొన్న పశువులనో, ఇంటినో, వస్తువులనో ఈ సంఘటనలకు కారణముగా చూపిస్తూ
ఉంటారు.
ఉదాహరణకు ఇంటిలోకి కొత్త కోడలు వచ్చిన
కొన్ని రోజులలోనే ఆ ఇంటిలోఎవరైనా మరణిస్తే అలాంటప్పుడు మృత్యు దోషమునకు కారణము
కొత్తకోడలు అని, దురదృష్టవంతురాలు వస్తూనే ఒకరిని బలి ఇవ్వవలసి వచ్చింది అని అంటారు. కానీ
వాస్తవముగా ఆకస్మిక దుర్ఘటనలు జరిగినప్పుడు మనస్సు తీవ్ర బాధకు గురియై కర్తవ్యములను
వదిలేసి మాటలను వాడటం జరుగుతూ ఉంటుంది. అకస్మాత్తుగా వచ్చు మూడు రకములైన
సుఖదుఖములు (దైవిక, దైహిక, భౌతిక
సంఘటనలు) సంచిత, ప్రారబ్ధ, ఆగామి
కర్మలపై ఆధారపడి ఉంటాయి.
No comments:
Post a Comment