పరిణామక్రమములో ఏమి చెయ్యాలి అనేది
మనకు ఎలా తెలుస్తుంది? ఆ కాలములో పుట్టిన మహానుభావులు డైరెక్ట్ గా చెప్తారు మీరు ఏమి చెయ్యాలో
ఏమి చెయ్యకూడదో. డైరెక్ట్ గా గాయత్రీ మంత్రము చేసుకుంటే సామూహికమైన ప్రారబ్ధ
విచ్ఛేదనకు కావలసినటువంటి మార్గము ఏర్పడుతుందని గురువుగారు (పండిత శ్రీరామశర్మ
ఆచార్య) చెప్తున్నారు. ఇప్పుడు ప్రారబ్ధకర్మను మార్చుకోవడానికి ఐదు రకాలైన జీవిత
చర్యలను చేసుకోవాలి. ప్రపంచములో మానవ శరీరధారి అయినవాడు ఎవరైనా సరే ఈ సంచిత
ప్రారబ్ధకర్మను పూర్తి చేసుకోవడానికే పుడతాడు.
ఎక్కడ ఏమి చదువుకోవాలో అక్కడ
చదువుకోలేదు అందుకని ఎక్కడ ఎవరిని పెళ్ళిచేసుకోవాలో అక్కడ పెళ్ళి చేసుకోలేదు.
అందుకని పిల్లలు ఎవరు పుట్టాలో వాళ్ళు పుట్టరు. చదువు పెళ్ళిళ్ళ విషయములలో ఏ
ప్రారబ్దకర్మలతో కిందకు దిగామో, వాటికి (చదువు పెళ్ళి) కావలసిన అనుకూల
పరిస్థితులు తెచ్చుకోలేదు కనుక పుట్టవలసిన పిల్లలు కాకుండా ఇంకొక రకమైన పిల్లలు
పుడతారు. అంటే ప్రారబ్దకర్మలో ఏ పిల్లలైతే పుట్టాలని వ్రాసి ఉందో ఆ పిల్లలు
కాకుండా వేరేవారు పుడతారు. కారణం ఏమిటంటే, అంటే చదువుకోవలసిన
వయస్సులో చదువుకోగలిగిన పరిస్థితులు ఉన్నా ఏదో ఒక కారణము చేత చదువుకోలేదు. అందుచేత
చేసుకోవలసిన వానితో వివాహంకాకుండా వేరేవారితో జరుగుతుంది. అక్కడ కర్మాధి దేవతలకు
తెలుసు కదా ఏది జరగాలో ఏది జరగకూడదో అందుకని ఆ పుట్టవలసిన పిల్లలు (ముగ్గురో నాలుగురో) పుట్టరు. ఈ అడ్డదిడ్డాన్ని balance
చేసుకోవడానికి ప్రకృతిలో family planning వచ్చింది.
Family planning రావడానికి
కారణాలు ఏవైనా చెప్పుకోవచ్చు. కానీ దానికి అసలైన కారణం ఇది. Family
planning భారతీయ ఆధ్యాత్మికతకు విరుద్ధము. కానీ కర్మాధి దేవతలకు
లింక్ ఎక్కడా దొరకడం లేదు అందుకని అసలు వద్దుపొండి అన్నారు. అసలు వద్దుపొండి అంటే
ప్రమాదం సూక్ష్మ జగత్తులో జరిగింది ఆ దేశకాల పరిస్థితులలో ఏ తల్లితండ్రులకి ఎవరు
ఎక్కడ పుట్టాలో ఆ పరిస్థితులలో పుట్టకపోవడం వల్ల సంచితకర్మ పెరిగిపోతోంది, దానిని పాపభారం పెరిగింది అంటాము. కలియుగములో పాపభారం పెరగడం వల్ల భూదేవి
అల్లల్లాడి పోతుంది అంటే అంతరార్ధం ఇది. విశుద్ధమైన విజ్ఞానం పెరిగిపోతోంది.
పిల్లలు పుట్టారు. ఈ పిల్లలు నీ భౌతిక
శరీరము, నీ మనోమయ శరీరము, నీ కామమయ శరీరము నీ ప్రారబ్ధకర్మను
అనుభవించడానికి అనుకూలముగా ఏ కర్మాధి దేవతలు తీర్చిదిద్దారో దానికి తగినట్టు
వచ్చిన పిల్లలు మాత్రము వాళ్ళు కాదు. శరీరము తయారయింది. దానికి కావలసిన చదువు
పెళ్ళి కాలేదు. పెళ్ళి అంటే సంబంధాలు. పెళ్ళి అంటే భార్యా భర్తేనా? ఆమెతో పాటు అత్తగారు, మామగారు, ఆడపడచులు, మరుదులు, చుట్టాలు చాలామంది
వస్తారు. చాలా బంధాలు (లింక్స్) వస్తాయి. ఈ లింక్స్ అన్నీ కూడా మనం ప్లాన్
చేసుకున్నవి కాదు. పిల్లలు కూడా మనం ప్లాన్ చేసుకున్న వాళ్ళు కాదు. ప్లాన్ చేసుకున్నాము అని భావిస్తుంటాము. అందుచేత పెళ్ళైనప్పటి నుంచి మనోమయ
కోశము, కామమయ కోశము అనేక ఒత్తిళ్ళకు గురై సుఖాన్ని
కోల్పోతుంది. అందుకని కర్మ సిద్ధాంతాన్ని అర్ధం చేసుకుంటే చాలా స్పష్టముగా అర్ధం
అయిపోతుంది ఎక్కడ తప్పు జరుగుతోందో. సవరించుకోవడం తేలిక. అందుకని చేయదలచుకున్న
తపస్సులు కర్మ ఆధారముగా నిర్ణయించుకోవాలి. (see ద్వాదశ తపస్సులు)
చేయవలసిన తపస్సును ఎలా
నిర్ణయించుకోవాలి? ప్రారబ్ధకర్మ మాత్రమే తెలుసు సంచితకర్మ ఏమి తెలియదు ప్రస్తుతం. ఆగామికర్మ
ఎలా ఏర్పడుతుంది? సంచితకర్మ ఇప్పుడు చేస్తున్నటువంటి కర్మ
కలసి చనిపోయేటప్పుడు ఆగామికర్మగా ఏర్పడుతుంది. అందులో మళ్ళీ ప్రారబ్ధకర్మని
చేసుకుంటాము. ప్రారబ్ధకర్మ ఏమిటో స్పష్టముగా తెలిస్తే జీవిత విధానము వేరేరకముగా
ఉంటుంది. కానీ ప్రారబ్ధకర్మ తెలియడానికి అందరు ఋషులు అవలేరు కనుక వారు
జ్యోతిష్యశాస్త్రము అందించారు. జ్యోతిష్యశాస్త్రము అవగాహన ఉన్నవాళ్ళు 80%
ప్రారబ్ధకర్మను కరెక్ట్ గా చెప్పేయగలరు. పుస్తకాలను చూసి జ్యోతిష్యము చెప్పేవాళ్ళు
కాదు. ఋషులు అయితే 100% చెప్పేయగలరు. అందుచేతనే పూర్వకాలములో ఋషులు ఏది చెప్తే అవి
జరిగేవి. నిజంగా జ్యోతిష్యశాస్త్రమును కనుక అధ్యయనం చెయ్యగలిగితే ఈ ప్రారబ్ధకర్మను
గురించి చాలా అవగాహన వస్తుంది అప్పుడు ఏ పేరు పెట్టాలో దగ్గర నుంచి ఏమి
చదువుకోవాలో, ఎవరిని పెళ్ళి చేసుకోవాలో, పిల్లలు ఎప్పుడు పుట్టాలో, ఆ పిల్లలకు
ఎప్పుడెప్పుడు ఏ ఏ సంస్కారాలు చెయ్యాలో మొత్తము కూడా జ్యోతిష్య శాస్త్రము ఆధారముగా
జరగవలసిన కర్మలు. విశాలమైన భారతీయ సంస్కృతికి ఆధారమైన జ్యోతిష్యశాస్త్రము ఇప్పుడు దాదాపుగా
కాలగర్భములో కలిసిపోయింది. నిజమైన జ్యోతిష్యశాస్త్రము యొక్క అవగాహన చాలామందికి
లేదు. ఆ జ్యోతిష్య శాస్త్రమును ఒక సవ్యమైన పద్ధతిలో పెట్టడానికి పండుగలు
ఏర్పడ్డాయి. (See పండుగలు)
No comments:
Post a Comment