Thursday, July 11, 2013

అపాంభేషజ (జల చికిత్స) సూక్తం


ఋషి – సింధుద్వీప్, కృతి / అధర్వ, దేవత – ఆపన్నపాత్, సోమ మరియు ఆపః దేవత,
ఛందస్సు – గాయత్రి, 4 పురస్తాద్ బృహతి

శం నో దేవీరభీష్ట్య ఆపో భవంతు పీతయే |
శం యోరభిః స్రవంతు నః  ||
దైవీగుణాలు కలిగిన ఆపః (జలము) మాకు అన్ని విధాలా కళ్యాణమైనది, ప్రసన్నదాయకమైనది అగుగాక. మా కోరికలను తీర్చి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక.

2. అప్సు మే సోమో అబ్రవీదన్తర్విశ్వాని భేషజా |
అగ్నిం చ విశ్వశంభువం  ||
దివ్య జలము అన్ని విధాలా ఓషధ గుణాలు కలిగి ఉన్నది అని సోమదేవుడు ఉపదేశిస్తున్నాడు. అందులోనే కళ్యాణకరమైన అగ్ని కూడా నెలకొని ఉన్నది.

3. ఆపః పృణీత భేషజం వరూధం తన్వే మమ |
జ్యోక్ చ సూర్యం దృశే ||
సూర్యుడ్ని దీర్ఘకాలం వరకు దర్శింతుముగాక, అనగా దీర్ఘజీవనం పొందెదముగాక. హే ఆపః ! శరీరానికి ఆరోగ్యకరమైన దివ్య ఔషధులను ప్రసాదించుము.

4. శం న ఆపో ధన్వన్యాః  శము సంత్వనూప్యాః |
శం నః ఖనిత్రిమా ఆపః శము యాః
కుంభ ఆభృతాః శివా నః సంతు వార్షికీః  ||
ఎడారులలో జలం మాకు కళ్యాణకరమైనది అగుగాకనీతిమయమైన ప్రదేశంలోని జలం మాకు సుఖాన్ని ప్రసాదించుగాక. భూమిని తవ్వి తీసే బావులలోని జలం మాకు సుఖప్రదమైనది గాక. పాత్రల్లోని నీరు మాకు శాంతినిచ్చుగాక. వర్షపు నీరు మా జీవితాల్లో సుఖశాంతులను వర్షించుగాక.

ఆచమనము
ఈ క్రింది మంత్రమును పఠిస్తూ, స్థూల, సూక్ష్మ, కారణ శరీరములు వికసించునట్లు భావించుచు మూడుసార్లు ఆచమనము చేయవలెను.
ఓం అమృతోపస్తరణమసి స్వాహా
ఓం అమృతాపిధానమసి స్వాహా
ఓం సత్యం, యశః, శ్రీర్మయి శ్రీః శ్రయితామ్ స్వాహా

No comments:

Post a Comment